జిల్లా వ్యాప్తంగా హాస్టల్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి -- జిల్లా బిసి డిడి యుగంధర్ ని కలిసి విజ్ఞప్తి చేసిన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏపీ ఎస్ ఎఫ్ ( APSF )రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర.
నేడు స్థానిక బీసీ వెల్ఫేర్ జిల్లా కార్యాలయం నందు జిల్లా డి డి గారిని కలిసి పలు సమస్యల మీద ప్రస్తావించి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్ ( APSF ) రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్స్ లో ఉన్నటువంటి సమస్యలు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని, వార్డెన్లు స్థానికంగా ఉండాలని, అన్ని హాస్టల్లో బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలని,
హాజరు పట్టిక నమోదు చేసి నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని, జిల్లావ్యాప్తంగా మెస్ బిల్లులు సరిగా పడలేదని కుంటి సాకు తో వార్డెన్లు విద్యార్థులకు కడుపునిండా భోజనం పెట్టక పోవడాన్ని వారు
తప్పు పడ్డారు. మెనూ ప్రకారం విద్యార్థులందరికీ నాణ్యమైన పౌష్టికాహార భోజనాన్ని, గుడ్డును తప్పకుండా అందించాలని,ఈ సమస్యలన్నీ సకాలంలో పరిష్కరించకుంటే జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు సురేష్, జిల్లా కార్యదర్శి వినయ్, నగర నాయకులు రవి,తేజ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.