Labels

APSF

Tuesday, 7 February 2012


ఇంటర్నెట్ ను మార్చిన వ్యక్తులు....ఫోటోలు(పార్ట్-2)

మొట్టమొదటి వాం వైరస్......రాబర్ట్ తపన్ మారిస్(Robert Tappan Morris).....హాకింగ్ కంటే వాం వైరస్(Worm Virus)కంప్యూటర్లను పాడుచేయటంలో చాలా బలమైనది. నెట్ వర్క్ లలోకి స్వయంగా వెళ్లనవసరం లేకుండా ఒక చిన్న ప్రోగ్రాం ను కోడ్ చేసి పంపితే చాలు కంప్యూటర్లు పాడైపోతాయి.ఈ ప్రయత్నంగానే రాబర్ట్ తపన్ మారిస్, మారిస్ అనే వాం ను క్రియేట్ చేసేడు.అంతర్జాలంలోకి పంపబడిన మొదటి వైరస్ ఇదే. 1980లలో ఈ వైరస్ వలనే కొన్ని వేల డాలర్ల నష్టం కలగటంతో పాటూ ఉత్పాదకత కూడా తగ్గిపోయింది.
జియోసిటీస్....డేవిడ్ బాహ్నట్(David Bohnett) .....ఈయన, జాన్ రెజ్ఞర్(John Rezner) తో కలిసి 1994 లో జియోసిటీస్ పేరుతో మొట్టమొదటి అంతర్జాల సమాజాన్ని మొదలుపెట్టేరు. అంతర్జాలంలో ప్రతి ఒక్కరికీ ఒక ఉచిత వెబ్ పేజీ ఇవ్వాలనే కాన్సెప్ట్ ను ముందుంచి, దానిని ప్రవేశపెట్టేరు. అక్టోబర్ 27,2009 న ఈ కంపెనీని మూసేసేరు.
మొట్టమొదటి వికీ...వార్డ్ కున్నింగ్ హాం(Ward Cunningham)....... అమెరికాకు చెందిన ఈయన మొట్టమొదటి వికీ కనుగొన్నారు.దీని మూలంగా అందరూ కలిసికట్టుగా అంతర్జాలంలో ఒక వ్యాసాన్ని రాయవచ్చు, దానిని సరిచేయవచ్చు. హవాయ్ బాషలో క్విక్ అనే పదాన్ని వికీ గా పెట్టేరు.
హాట్ మైల్....సబీర్ బాటియా(Sabeer Bhatia)... హాట్ మైల్(HOTMAIL) అనే ఆంగ్ల పదంలో హ్చ్.టి.ఎం.ఎల్(HTML) అనే అక్షరాలు ఉంటాయి. హ్చ్.టి.ఎం.ఎల్ ను ఉపయోగించే వెబ్ పేజ్ రాయగలరు.ఈయన సొంతంగా తయారుచేసిన ఉచిత ఈ- మైల్ సేవలను అందించే హాట్ మైల్ ను ఎప్పుడైతే ఈయన మైక్రో సాఫ్ట్ కి (400 మిల్లియన్ డాలర్లకు) అమ్మేసేరో అప్పటినుండే ఈయన వార్తలలోకి వచ్చేరు. 1998 లో "ఎంటర్పైనర్ ఆఫ్ ది ఇయర్" అవార్డ్ గెలుచుకున్నారు.2002 లో టైం మాగజైన్ ఈయన్ను అంతర్జాలం "గమనించవలసిన వ్యక్తి" గా పేర్కొన్నది.2009 లో ఈయన "జాక్స్టిర్" అనే అంతర్జాల గ్లోబల్ కాలింగ్ నెట్ వర్క్ ను కొనుకున్నారు. ఇది ఏదో ఒక రోజు "స్కైప్" ను దాటి ముందుకు వెడుతుందని చెబుతున్నారు.
గూగుల్...లారీ పేజ్ మరియూ సెర్గే బ్రిన్(Lasrry Page and Sergey Brin).....ఇంటర్నెట్ సెర్చ్ విధానాన్ని మార్చిన వారు.ఈ కంపెనీ పెద్దదిగా రావడానికీ,అంతర్జాల సెర్చ్ లో పెద్దదిగా ఉండాలనే ఆశతో ఏంతో కష్టపడ్డరు. వారి దగ్గరున్న డబ్బుతోనే కంపెనీను పెద్దదిచేసేరు. దాని అభివ్రుద్ది వీరు అనుకున్నదానికంటే ఎక్కువగా ఉండటంతో ప్రైవేట్ పెట్టుబడులకు వెళ్లేరు. ఈరోజుకు కూడా వీరు గూగుల్ వ్యాపారం కంటే ఇంజనీరింగ్ కే ఎక్కువ మక్కువ చూపిస్తారు.
మైక్రో సాఫ్ట్....బిల్ గేట్స్(Bill Gates)...."మైక్రో- సాఫ్ట్" ...మైక్రో కంప్యూటర్ మరియూ సాఫ్ట్ వేర్ ను కలిపే ఈయన మైక్రో సాఫ్ట్ అని పేరు పెట్టేరు.కొద్ది రోజులకు ఈయన కొత్త GUI(గ్రాఫికల్ యూసర్ ఇంటర్ఫేస్)అనే డిస్క్ ఆపరేటింగ్ సిస్టం ను కనుకున్నారు. దానికి "విండోస్" అని పేరు పెట్టేరు. ప్రతి ఇంటిలొనూ, ప్రతి టేబుల్ మీద ఒక కంప్యూటర్ ఉండాలనే తన ఆశను నెరవేర్చుకున్నారనే చెప్పాలి.
ఆపిల్...స్టీవ్ జాబ్స్(Steve Jobs)..... పర్సనల్ కంప్యూటర్ అని ఈయన కనిపెట్టిన నూతన పద్దతి కంప్యూటర్ హార్డ్ వేర్ మరియూ సాఫ్ట్ వేర్ పరిశ్రమలనే మార్చేసింది. ఈ రోజు మనం అంతర్జాలం మూలంగా పనిచేస్తున్న విధానాన్నీ, వాడుతున్న విధానాన్నీ పూర్తిగా మార్చేరు.వెబ్ డిజైన్ను సులభంగా చేసేరు.
యాహూ... డేవిడ్ ఫిలో మరియూ జర్రీ యాంగ్(David Filo and Jerry Yang) యాహూ ను మొదలుపెట్టేరు. టైం పాస్ కోసరం మొదలుపెట్టిన ఈ సంస్థ ఈ రోజు ప్రపంచవ్యాప్త ముద్ర వేసుకున్నది. "Yet Another Hierarchical Officious Oracle" అనే దానికి సంక్షిప్తపదం Yahoo! అని అందరూ చెబుతున్నా వీరు మాత్రం జనరల్ డెఫినిషన్ కోసమే ఆ పేరు పెట్టేమంటున్నారు.

No comments:

Post a Comment

Blogger Gadgets