భారతదేశంలో పేదరికం తగ్గుముఖం పట్టిందట!!!?...ఫోటోలు
నగరాల్లో రోజువారి తలసరి వినియోగాన్ని రూ. 28.65గాను, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 22.42 గాను నిర్ధారించడం ద్వారా 2009-10 సంవత్సరానికి దేశంలో పేదరికం 29.8శాతానికి పడిపోయినట్టు ప్రణాళికా సంఘం తాజా నిర్వచనమిచ్చింది. నెలసరిన పట్టణ ప్రాంతాల్లో తలసరి వినియోగం రూ. 859.5లు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 672.8లు ఉన్న వారిని పేదవారిగా పరిగణించనవసరం లేదని నిర్వచనంలో పేర్కొంది. 2004-05 సంవత్సరంలో దేశంలో ఉన్న 40.72 కోట్ల మంది నిరుపేదలుండగా 2009-10 నాటికి వారి సంఖ్య 34.47 కోట్లకు పడిపోయినట్లు పేర్కొంది. భారత దేశంలో పేదలుగా పరిగణింపబడడానికి ఎంత పేదరికం ఉండాలి? ఈ ప్రశ్నకి సాధారణంగా ఎవరైనా చెప్పే సమాధానం, ఉండటానికి ఇల్లు, కడుపునిండా తిండి, వైద్యం చేయించుకోగల స్తోమత, గౌరవనీయంగా కనపడడానికి అవసరమైన బట్ట లేని వారు పేదవారని. కానీ ప్రణాళికా సంఘం దృష్టిలో నగరాల్లో రోజువారి రూ. 28.65 ఖర్చు పెట్టగలినవారూ,, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 22.42 ఖర్చు పెట్టగలినవారూ పేదవారు కారట. మరి వీరంతా ఏ లెక్కలోకి వస్తారు...పేదవారిలో ధనవంతులా?
No comments:
Post a Comment