భారతదేశంలో పేదరికం తగ్గుముఖం పట్టిందట!!!?...ఫోటోలు
నగరాల్లో రోజువారి తలసరి వినియోగాన్ని రూ. 28.65గాను, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 22.42 గాను నిర్ధారించడం ద్వారా 2009-10 సంవత్సరానికి దేశంలో పేదరికం 29.8శాతానికి పడిపోయినట్టు ప్రణాళికా సంఘం తాజా నిర్వచనమిచ్చింది. నెలసరిన పట్టణ ప్రాంతాల్లో తలసరి వినియోగం రూ. 859.5లు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 672.8లు ఉన్న వారిని పేదవారిగా పరిగణించనవసరం లేదని నిర్వచనంలో పేర్కొంది. 2004-05 సంవత్సరంలో దేశంలో ఉన్న 40.72 కోట్ల మంది నిరుపేదలుండగా 2009-10 నాటికి వారి సంఖ్య 34.47 కోట్లకు పడిపోయినట్లు పేర్కొంది. భారత దేశంలో పేదలుగా పరిగణింపబడడానికి ఎంత పేదరికం ఉండాలి? ఈ ప్రశ్నకి సాధారణంగా ఎవరైనా చెప్పే సమాధానం, ఉండటానికి ఇల్లు, కడుపునిండా తిండి, వైద్యం చేయించుకోగల స్తోమత, గౌరవనీయంగా కనపడడానికి అవసరమైన బట్ట లేని వారు పేదవారని. కానీ ప్రణాళికా సంఘం దృష్టిలో నగరాల్లో రోజువారి రూ. 28.65 ఖర్చు పెట్టగలినవారూ,, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 22.42 ఖర్చు పెట్టగలినవారూ పేదవారు కారట. మరి వీరంతా ఏ లెక్కలోకి వస్తారు...పేదవారిలో ధనవంతులా?
ఇంటర్నెట్ ను మార్చిన వ్యక్తులు....ఫోటోలు(పార్ట్-2)
మొట్టమొదటి వాం వైరస్......రాబర్ట్ తపన్ మారిస్(Robert Tappan Morris).....హాకింగ్ కంటే వాం వైరస్(Worm Virus)కంప్యూటర్లను పాడుచేయటంలో చాలా బలమైనది. నెట్ వర్క్ లలోకి స్వయంగా వెళ్లనవసరం లేకుండా ఒక చిన్న ప్రోగ్రాం ను కోడ్ చేసి పంపితే చాలు కంప్యూటర్లు పాడైపోతాయి.ఈ ప్రయత్నంగానే రాబర్ట్ తపన్ మారిస్, మారిస్ అనే వాం ను క్రియేట్ చేసేడు.అంతర్జాలంలోకి పంపబడిన మొదటి వైరస్ ఇదే. 1980లలో ఈ వైరస్ వలనే కొన్ని వేల డాలర్ల నష్టం కలగటంతో పాటూ ఉత్పాదకత కూడా తగ్గిపోయింది.
జియోసిటీస్....డేవిడ్ బాహ్నట్(David Bohnett) .....ఈయన, జాన్ రెజ్ఞర్(John Rezner) తో కలిసి 1994 లో జియోసిటీస్ పేరుతో మొట్టమొదటి అంతర్జాల సమాజాన్ని మొదలుపెట్టేరు. అంతర్జాలంలో ప్రతి ఒక్కరికీ ఒక ఉచిత వెబ్ పేజీ ఇవ్వాలనే కాన్సెప్ట్ ను ముందుంచి, దానిని ప్రవేశపెట్టేరు. అక్టోబర్ 27,2009 న ఈ కంపెనీని మూసేసేరు.
మొట్టమొదటి వికీ...వార్డ్ కున్నింగ్ హాం(Ward Cunningham)....... అమెరికాకు చెందిన ఈయన మొట్టమొదటి వికీ కనుగొన్నారు.దీని మూలంగా అందరూ కలిసికట్టుగా అంతర్జాలంలో ఒక వ్యాసాన్ని రాయవచ్చు, దానిని సరిచేయవచ్చు. హవాయ్ బాషలో క్విక్ అనే పదాన్ని వికీ గా పెట్టేరు.
హాట్ మైల్....సబీర్ బాటియా(Sabeer Bhatia)... హాట్ మైల్(HOTMAIL) అనే ఆంగ్ల పదంలో హ్చ్.టి.ఎం.ఎల్(HTML) అనే అక్షరాలు ఉంటాయి. హ్చ్.టి.ఎం.ఎల్ ను ఉపయోగించే వెబ్ పేజ్ రాయగలరు.ఈయన సొంతంగా తయారుచేసిన ఉచిత ఈ- మైల్ సేవలను అందించే హాట్ మైల్ ను ఎప్పుడైతే ఈయన మైక్రో సాఫ్ట్ కి (400 మిల్లియన్ డాలర్లకు) అమ్మేసేరో అప్పటినుండే ఈయన వార్తలలోకి వచ్చేరు. 1998 లో "ఎంటర్పైనర్ ఆఫ్ ది ఇయర్" అవార్డ్ గెలుచుకున్నారు.2002 లో టైం మాగజైన్ ఈయన్ను అంతర్జాలం "గమనించవలసిన వ్యక్తి" గా పేర్కొన్నది.2009 లో ఈయన "జాక్స్టిర్" అనే అంతర్జాల గ్లోబల్ కాలింగ్ నెట్ వర్క్ ను కొనుకున్నారు. ఇది ఏదో ఒక రోజు "స్కైప్" ను దాటి ముందుకు వెడుతుందని చెబుతున్నారు.
గూగుల్...లారీ పేజ్ మరియూ సెర్గే బ్రిన్(Lasrry Page and Sergey Brin).....ఇంటర్నెట్ సెర్చ్ విధానాన్ని మార్చిన వారు.ఈ కంపెనీ పెద్దదిగా రావడానికీ,అంతర్జాల సెర్చ్ లో పెద్దదిగా ఉండాలనే ఆశతో ఏంతో కష్టపడ్డరు. వారి దగ్గరున్న డబ్బుతోనే కంపెనీను పెద్దదిచేసేరు. దాని అభివ్రుద్ది వీరు అనుకున్నదానికంటే ఎక్కువగా ఉండటంతో ప్రైవేట్ పెట్టుబడులకు వెళ్లేరు. ఈరోజుకు కూడా వీరు గూగుల్ వ్యాపారం కంటే ఇంజనీరింగ్ కే ఎక్కువ మక్కువ చూపిస్తారు.
మైక్రో సాఫ్ట్....బిల్ గేట్స్(Bill Gates)...."మైక్రో- సాఫ్ట్" ...మైక్రో కంప్యూటర్ మరియూ సాఫ్ట్ వేర్ ను కలిపే ఈయన మైక్రో సాఫ్ట్ అని పేరు పెట్టేరు.కొద్ది రోజులకు ఈయన కొత్త GUI(గ్రాఫికల్ యూసర్ ఇంటర్ఫేస్)అనే డిస్క్ ఆపరేటింగ్ సిస్టం ను కనుకున్నారు. దానికి "విండోస్" అని పేరు పెట్టేరు. ప్రతి ఇంటిలొనూ, ప్రతి టేబుల్ మీద ఒక కంప్యూటర్ ఉండాలనే తన ఆశను నెరవేర్చుకున్నారనే చెప్పాలి.
ఆపిల్...స్టీవ్ జాబ్స్(Steve Jobs)..... పర్సనల్ కంప్యూటర్ అని ఈయన కనిపెట్టిన నూతన పద్దతి కంప్యూటర్ హార్డ్ వేర్ మరియూ సాఫ్ట్ వేర్ పరిశ్రమలనే మార్చేసింది. ఈ రోజు మనం అంతర్జాలం మూలంగా పనిచేస్తున్న విధానాన్నీ, వాడుతున్న విధానాన్నీ పూర్తిగా మార్చేరు.వెబ్ డిజైన్ను సులభంగా చేసేరు.
యాహూ... డేవిడ్ ఫిలో మరియూ జర్రీ యాంగ్(David Filo and Jerry Yang) యాహూ ను మొదలుపెట్టేరు. టైం పాస్ కోసరం మొదలుపెట్టిన ఈ సంస్థ ఈ రోజు ప్రపంచవ్యాప్త ముద్ర వేసుకున్నది. "Yet Another Hierarchical Officious Oracle" అనే దానికి సంక్షిప్తపదం Yahoo! అని అందరూ చెబుతున్నా వీరు మాత్రం జనరల్ డెఫినిషన్ కోసమే ఆ పేరు పెట్టేమంటున్నారు.
ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్..... ఇంటర్నెట్ ను మనకు అందించిన వ్యక్తులు అంటే వారు చాలా మంది ఉన్నారు. కానీ వింట్ సెర్ఫ్(Vint Cerf)ని ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ అంటారు. ఈయన బాబ్ కహన(Bob Kahn)తో కలిసి TCP/IP కమ్యూనికేషన్ ప్రొటోకాల్స్ ను అందించేరు. దీని మూలంగానే ఒక కంప్యూటర్ మరో కంప్యూటర్తో నెట్ వర్క్ మూలంగా మాట్లాడుకుంటాయి."ఇంటర్నెట్ అనేది ప్రజలయొక్క అద్దం లాంటిది.స్పాం అనేది ఉచిత సేవల యొక్క సైడ్ ఎఫ్ఫెక్ట్" అని ఒక ప్రసంగంలో చెప్పేరు.WWW ను ఇన్వెంట్ చేసినాయన.... టిం బెర్నర్స్ లీ(Tim Berners-Lee)...ఈయనే వరల్డ్ వైడ్ వెబ్(WWW)ను ఇన్వెంట్ చేసినది. మొదటి వెబ్ క్లయంట్ మరియూ సర్వర్ ను రాసి లింకులూ, హైపర్ లింకులూ మరియూ ఆన్ లైన్ ఇన్ ఫర్మేషన్ ను క్రియేట్ చేసేరు.ఇప్పుడు కూడా ఈయన అంతర్జాల ప్రమాణ సంరక్షడిగా కొనసాగుతూ అంతర్జాల డిజైన్ మెరుగు పరిచే డైరెక్టరుగా వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం (W3C)లో ఉంటున్నారు.ఫాదర్ ఆఫ్ ఈ-మైల్...... రే టాం లిన్సన్(Ray Tomlinson)...ఈయన ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్మర్. ఫాదర్ ఆఫ్ ఈ-మైల్ అని పిలువబడే ఈయన మెసేజ్ లను ఒక మిషన్ నుండి మరొక మిషన్ కు,ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికీ, ఒక ఖండం నుండి మరో ఖండానికీ సముద్రాలు దాటి వెళ్లే విధముగా చేయగలిగేరు. ఈ మైల్ అడ్రెస్సులలో @ గుర్తును ఈయనే ఫార్మాట్ చేసేరు.ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రోజుకు ఒక బిల్లియన్ మంది @ గుర్తును టైప్ చేస్తున్నారు.ఇ-పుస్తకాల పుట్టుక....... మైకల్ హార్ట్(Micheal Hart)....ఈయనే ఇ-పుస్తకాల పుట్టుకకు కారణం. ఈయనే అజ్ఘ్ణానమూ మరియూ నిరక్షరాస్యతా యొక్క అడ్డుగోడలను చ్చేధించేడు. ప్రపంచ మొట్టమొదటి ఎలక్ట్రానిక్ లైబ్రరీ "ప్రాజక్ట్ గుటెన్ బెర్గ్" ను మొదలుపెట్టి ప్రపంచ ప్రజలు చదువుకునే విధానాన్ని మార్చేరు. కాపీరైట్ పుస్తకాలతో పాటూ పౌరప్రదేశ వ్యాసాలను చేర్చేరు.మొట్టమొదటి స్పాం ఈ-మైల్....... గారీ తుయేరక్ (Gary Thuerk).....స్పామ్మింగ్ ఒక పాత మార్కెటింగ్ టెక్నిక్. గారీ తుయేరక్ అనే ఈయన మొదటిసారి గుంపుగా ఈ-మైల్స్ ను ఆర్పనెట్ మూలంగా తన వ్యాపర మిత్రులకు పంపించేరు. ఆ రోజు ఈయనకు తెలియని విషయమేమిటంటే ఈయనే ప్రపంచములో మొదటి స్పాం పంపిన ఆయన అని.మొట్టమొదటి మనోభావ గుర్తు (ఎమోటికాన్స్)....... స్కాట్ ఫాల్ మాన్(Scott Fahlman) అనే ఈయన ASCII అధారంగా నవ్వు ఎమోటికాన్ ను ప్రారంభించేరు.అంతర్జాల వ్యాసాలలో హాస్యాస్పధమైనవీ, శోకంగా ఉన్న వాటిని చదివిన వారు గుర్తించేందుకు గానూ మొదలుపెట్టేరు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరూ దీనిని ప్రతి విషయానికీ వాడుతున్నారు.నెట్ స్కేప్ నావిగేటర్........ మార్క్ ఆండర్ సన్(Marc Andreessen)......ఈయన అంతర్జాల విహారం లో విప్లవమాత్మక మార్పులు తీసుకువచ్చేరు. అంతర్జాలంలో విస్త్రుతంగా వాడబడిన వెబ్ బ్రౌజర్ "మోసైయక్" ను రూపొందించి, ఆ తరువాతా దానిని నెట్ స్కేప్ నావిగేటర్ గా అందించేరు.ఈయన డిగ్, ప్లాజస్ మరియూ ట్విట్టర్ లో సహ వ్యవస్తాపకులుగా ఉంటున్నారు.అంతర్జాల రిలే చ్చాటింగ్........ జర్కో ఓయ్కరేనన్(Jarkko Oikarinen).... ఈయన ఫిన్లాండ్లో మొదటిసారిగా ఆన్ లైన్ చ్చాట్ టూల్ రూపొందించేరు.1991 లో ఇది ప్రక్యాతి పొందింది. ఇరాక్ దేశం కువైత్ మీద దాడిచేసినప్పుడు రేడియో మరియూ టీవీ సిగ్నల్స్ మూసివేయబడ్డాయి.అప్పుడు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రపంచ ప్రజలు ఈయన రూపొందించిన చ్చాట్ రూం మూలంగా పొందగలిగేరు.